మన కదలికలను రికార్డ్ చేస్తున్న గూగుల్ యాప్స్

గూగుల్‌ సేవల్లో గోప్యతకు భంగం కలిగించే మరో లోపం బయటపడింది. గూగుల్‌ వినియోగదారులు ఎప్పుడు ఎక్కడ ఉన్నదీ చరిత్ర మొత్తం గూగుల్‌ ఖాతాలో నిక్షిప్తమయిపోతుంది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీరుండే చోటును నిల్వ చేయడానికి వీల్లేకుండా మీటను మార్చుకున్నా సరే కొన్ని రకాల గూగుల్‌ సేవలను యాండ్రాయిడ్‌ పరికరాల్లో, ఐఫోన్లలో ఉపయోగించిననప్పుడు మీ కదలికల చరిత్ర నిక్షిప్తమయిపోతుంది. ప్రిన్స్‌టన్‌కు చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ పరిశోధకులు ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ఏపీ వార్తా సంస్థ తేలిపారు


ఎలా గుర్తించారు?

అసోసియేటెడ్ ప్రెస్ విన్నపం మేరకు ప్రిన్‌స్టన్ యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ విభాగం పరిశోధకులు పరిశోధన చేశారు. యూనివర్సిటీకి చెందిన ఒక పరిశోధకుడు తన ఆండ్రాయిడ్ ఫోన్‌లో లొకేషన్ హిస్టరీని ఆఫ్ చేసి వివిధ ప్రాంతాలకు ప్రయాణించారు. ఆ తర్వాత ఫోన్‌లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని సేకరించి విశ్లేషించగా.. ఆయన న్యూయార్క్-ప్రిన్‌స్టన్ మధ్య రెండుసార్లు రైలులో తిరిగినట్టు, హైలైన్ పార్క్, చెలెసా మార్కెట్, హెల్స్ కిచెన్ తదితర ప్రాంతాల్లో తిరిగినట్టుగా నమోదై ఉన్నది. ఆయన తన ఇంటికి, ఆఫీస్‌కు ఎన్నెన్నిసార్లు వెళ్లారో కూడా రికార్డయ్యింది. గూగుల్ మ్యాప్స్, సెర్చ్ వంటి యాప్స్ వాడుతున్న ఐఫోన్‌లలోనూ వివరాలు రికార్డయినట్టు గుర్తించారు.




అదే సమయంలో నేరగాళ్లను పట్టుకోవడానికి పోలీసులకు ఉపకరిస్తుంది కూడా. లొకేషన్‌ చరిత్రను ఎప్పుడైనా మీరు ఆపివేయవచ్చని, ఆపివేస్తే మీరు వెళ్లే ప్రదేశాల వివరాలు నిక్షిప్తం కావని ఈ అంశంపై గూగుల్‌ సపోర్ట్‌ పేజీలో ఉంది. కానీ అది నిజం కాదు. లొకేషన్‌ చరిత్ర మీటను ఆపేసినా కొన్ని గూగుల్‌ యాప్‌లు మీరు ఎప్పుడు ఎక్కడ ఉన్నదీ సమాచారాన్ని మీ అనుమతి అడగకుండానే నిల్వ చేస్తాయి. ఉదాహరణకు మ్యాప్స్‌ యాప్‌ను తెరవగానే మీరెక్కడున్నదీ చూపించే స్నాప్‌షాట్‌ను నిల్వ చేసేస్తుంది. వాతావరణ సమాచారాన్ని స్వయంచాలితంగా తాజాపర్చే యాండ్రాయిడ్‌ ఫోన్‌ యాప్‌లు మీరు ఎక్కడ ఉన్నదీ గుర్తిస్తాయి. ప్రదేశంతో సంబంధమే లేని ‘చాకొలేట్‌  చిప్‌ కుకీస్‌’, కిడ్స్‌ సైన్స్‌ కిట్స్‌’ వంటి అన్వేషణలు మీరుండే అక్షాంశ, రేఖాంశాలను కచ్చితత్వంతో గుర్తించి మీ గూగుల్‌ ఖాతాలో సేవ్‌ చేస్తాయి.

No comments