గోంగూర రోజు తీసుకుంటే?

గోంగూరులో విటమిన్ సి ఎక్కువగా  ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని  పెంచేందుకు  చాలా  ఉపయోగపడుతుంది. గోంగూరలో ఐరన్ రక్తహీనతను సమర్థంగా నివారిస్తుంది. అనీమియా వ్యాధిగ్రస్తులకు గోంగూర మంచి ఔషధంగా  ఉపయోగపడుతుంది. కంటి సంబంధిత వ్యాధులకు గోంగూరను తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి..

గోంగూరలో పీచు పదార్థం  ఎక్కువగా  ఉంటుంది. . శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గోంగూరలోని పొటాషియం గుండె ఆరోగ్యానికి  చాలా ఉపయోగపడుతుంది. ఇందులోని మెగ్నిషియం మెదడు ఆరోగ్యానికి చక్కగా పనిచేస్తుంది. ఎముకల బలాన్ని పెంచుటకు గోంగూరను తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి

గోంగూరలో క్యాల్షియం, ఇనుము  ఎక్కువగా  ఉంటాయి. షుగర్ లెవెల్స్‌ను తగ్గించే శక్తి గోంగూరలో  ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్  ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారు గోంగూరను తీసుకుంటే చక్కని ఔషధంగా ఉపయోగ పడుతుంది


No comments