నాపై పథకం ప్రకారమే దాడి చేస్తున్నారు…..

భారత హై కమిషన్‌ వద్ద టీమిండియా జట్టుతో కలిసి దిగిన ఫొటో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.…. ఇంగ్లండ్ లో జరిగిన రెండో టెస్టుకు ముందు టీమిండియా ఆటగాళ్లు, జట్టు మేనేజ్ మెంట్ సిబ్బందికి లండన్ లోని భారత్ హైకమిషన్ కార్యాలయం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు అతని భార్య అనుష్క శర్మ కూడా హాజరుకావడం విమర్శలకు దారి తీసింది. ఈ అంశంపై ఇప్పటికే భారత హైకమిషన్, బీసీసీఐ వివరణ ఇచ్చినప్పటికీ విమర్శలు ఆగలేదు. దీంతోపాటు లార్ట్స్ టెస్టులో భారత్ ఘోరంగా ఓటమిపాలు కావడంతో విమర్శలు మరింత పెరిగాయి.

ఈ నేపథ్యంలో అనుష్క శర్మ స్పందించింది. ఆ రోజు నిబంధనలకు అనుగుణంగానే విందు కార్యక్రమం జరిగిందని ఆమె తెలిపింది. ఆ కార్యక్రమంలో తాను ఎందుకు పాల్గొన్నాననే విషయాన్ని కూడా అధికారులు వివరించారని… అయినా తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని మండిపడింది. ఇదంతా ఒక పథకం ప్రకారమే తనపై జరుగుతున్న దాడి అని తెలిపింది. ఇలాంటి విమర్శలపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పింది.



కాగా… వరుణ్‌ ధావన్‌, అనుష్క జంటగా నటించిన చిత్రం ‘సూయీ ధాగా’. శరత్‌ కటారియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోమవారం ముంబయిలో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ…. ‘15 ఏళ్ల వయసులోనే సంపాదించడం మొదలుపెట్టాను. ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఓ గృహిణి అంటే ఎలా ఉండాలి? అన్నది మాత్రం దర్శకుడు శరత్‌ ఇచ్చిన పాత్ర నుంచే నేర్చుకున్నా. ఈ సినిమాలో నేను గృహిణిగా ఇంటి పట్టునే ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి పాత్రల్లో ఇంతకుముందు నేనెప్పుడూ నటించలేదు. చెప్పాలంటే సినిమాలో నేను నా రీల్‌ భర్తతో కలిసి గడిపిన సమయం.. నా రియల్‌‌ లైఫ్‌ భర్త విరాట్‌తో కలిసి గడపలేకపోతున్నాను’ అని వెల్లడించారు.

No comments