బిగ్‌బాస్‌ ను౦డి బాబు గోగినేని ఔట్‌ !!

ఇప్పుడు  అందరూ అనుకున్నదే జరిగిందని తేలుస్తు౦ది.. ఇక  బిగ్‌బాస్‌ హౌజ్‌లో బాబు గోగినేని కథ ముగిసింది. హౌజ్‌లో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. అందరి సమస్యల్లో పాలు పంచుకుంటూ.. ఉండే బాబు హౌజ్‌లోంచి బయటకు వచ్చేశాడు. కొన్ని రోజుల నుంచి సోషల్‌ మీడియాలో బాబుపై నెటిజన్లు బారీగా  మండిపడుతున్న విషయం మన అ౦దరికి తెలిసిందే.అయితే  ఇక దీనికి తోడు కౌశల్‌ ఆర్మీ ఉండనే ఉంది. అసలే కౌశల్‌కు బాబు గోగినేనికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండటంతో.. కౌశల్‌ ఫాలోవర్స్   కు బాబుపై వ్యతిరేకత చూపించారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఎవరు ఉండాలి? ఎవరు వెళ్లాలి? అని డిసైడ్‌ చేసే కౌశల్‌ ఆర్మీ ఈ సారి బాబును బిగ్‌బాస్‌ హౌజ్‌ ను౦డి  బయటకు పంపేసింది.

హౌజ్‌లో అందరితో కలిసి ఉన్నట్లు కనిపించే బాబు.. కౌశల్‌ విషయం వచ్చేసరికి మాత్రం అమాంతం ఎగిరిపడేవారని మన అ౦దరికి తెలిసి౦దే. అయితే  కౌశల్‌తో ఢీ అంటే ఢీ అనేవారు. ఇక ఈ వారం జరిగిన షోలో మళ్లీ వీరిద్దరి మధ్య చిచ్చు రగిలింది. అమ్మాయిలకు రావాల్సిన డబ్బును దొంగలించాడని కౌశల్‌ను దొంగ అంటూ నిందించారు. గత వారాలన్నింటిలో కౌశల్‌ను టార్గెట్‌ చేసిన బాబు గోగినేని .. ఒకానొక దశలో కౌశల్‌ అయినా ఉండాలి నేనైనా ఉండాలి అంటూ ఆవేశపూరితంగా చెప్పుకొచ్చాడు. ఒక వేళ తాను వెళితే .. కౌశల్‌ను బయటకు పంపడానికి ప్రయత్నిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. ఈ విషయంలో బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాని మందలిస్తూ.. ఎవరు ఎవరిని బయటకు పంపలేరని, అది ప్రేక్షకుల చేతిలో ఉందంటూ.. బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారమే బాబు హౌజ్‌ నుంచి బయటకు వెళతారని పలువురు భావించారు. అయితే గతవారం నందిని రాయ్‌ బయటకు వెళ్లడంతో బాబు గోగినేని ఎలిమినేట్‌ కావడానికి వారం మాత్రమే ఆలస్యమైంది.


ఇక బయటకు వచ్చిన బాబు గోగినేని.. తనకు బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి రావడం చాలా  గొప్ప అనుభూతి ఇచ్చిదని .. ఈ బిగ్‌బాస్‌  ఇంట్లో సరదాగా ఉన్నాను, అల్లరి చేశాను, కోపడ్డాను, నేర్చుకున్నాను… నా కంటే వయసులో చిన్నవాళ్లతో ఇన్ని రోజులు ఇలా గడపడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు బాబు గోగినేని. అయితే మళ్లీ హౌజ్‌మేట్స్‌ తో మాట్లాడే అవకాశం నాని ఇవ్వగా.. బయటకి  రండి ఇక్కడ ప్రోమోలను చాలా బాగా వేశారు. తొందరగా వచ్చి మీరు కూడా మీ ప్రోమోలను చూసుకోండి అని సరదాగా అనడంతో హౌజ్‌లోని వారంతా ఒక్కసారిగా  నవ్వుకున్నారు. ఈ వారం అంతా బాత్రూమ్స్‌ను శుభ్రంగా ఉంచాలనే బిగ్‌బాంబ్‌ను.. సామ్రాట్‌ పేరు చెబుతూ.. తనకు వద్దులే ఎలాగూ బాగానే చేస్తాడు కాబట్టి.. రోల్‌రైడాకు ఇచ్చేద్దామంటూ.. అతనిపై బిగ్‌బాంబ్‌ వేశాడు. వారం మొత్తం గుర్తురాని రోల్‌.. బిగ్‌బాంబ్‌ అనే సరికి మాత్రం గుర్తొస్తున్నాడంటూ నాని అనగానే హౌజ్‌లో నవ్వులు పూశాయి. ఇక పదో వారం హౌజ్‌లో ఏ జరుగుతుందో వేచి చూడాలి. ఎదైనా జరుగొచ్చు.

No comments