శరీరానికి ఎండ తగలక పోతే ఊబకాయం….

చాలామంది ఎండలకు ఎండ వేడిమికి అధిక ఉష్ణోగ్రతలకు భయపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు బయపడుతుంటారు. ఇలా ఎండను చూసి భయపడి కూర్చుంటే బరువు పెరగుటకు దోహదపడుతారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలైనా సూర్యరశ్మి శరీరాన్ని తాకేవిధంగా చూసుకోవాలని పరిశోధకులు పేర్కొన్నారు. అలా చేయకపోతే శరీరానికి అవసరమైన విటమిన్ డి అందక ఊబకాయం తయారయ్యే ప్రమాదం ఉన్నది.


విటమిన్ డి శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక విటమిన్ తయారవకపోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. దీని ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోయి నీరసంగా మారుతారు. భారీ ఊబకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు.

కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండల సమీపంలోని పార్క్‌లకు వెళ్లితే మంచిది.

ఇంటి పెరడు ఉంటే కూడా అక్కడ పిల్లలతో చేరి వాకింగ్ చేస్తే మంచిది. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు బరువు పెరగడానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే కారణం. కాబట్టి ఊబకాయానికి గురికాకుండా ఉండాలంటే రోజూ కాస్త ఎండలో తిరగడం ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు తెలియజేశారు.

*శరీరంలో ఐరన్ లోపిస్తే కలిగే అనారోగ్య సమస్యలివే..!*

మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఐరన్ (ఇనుము) కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను తింటేనే మనకు రక్తం ఎక్కువగా పెరుగుతుంది.

దీంతో పలు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే మన శరీరంలో ఐరన్ తక్కువైతే కేవలం రక్త హీనత మాత్రమే కాదు, ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తాయి. అవేమిటంటే…

ఐరన్ లోపం వల్ల తీవ్ర అలసట ఉంటుంది. చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోతారు. అలసటతో పాటు చికాకు, బలహీనంగా మారడం, ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రోజువారీ పనులు చేస్తున్నా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంటుంది.
నిద్రలో కాళ్లు అదేపనిగా కదిలిస్తుండడం, దురదలు రావడం ఐరన్ లోపానికి సంకేతంగా చెప్పవచ్చు.
మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పిగా ఉంటుంది.
చిన్నపిల్లలు చాక్‌పీస్‌, మట్టి, కాగితాలు వంటివి తింటుంటే ఐరన్‌లోపం ఉన్నట్లు గుర్తించాలి.
ఐరన్‌లోపం ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అన్ని విషయాలకూ తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు.
ఐరన్ లోపం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది.
దానివల్ల హైపోథారాయిడిజమ్ అనే సమస్య తలెత్తవచ్చు. త్వరగా అలసిపోతుండడం, బరువు పెరుగుతుండడం, శరీరం చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఐరన్‌లోపం వల్ల జుట్టు ఊడిపోతుంటుంది.
నాలుక మంట పుట్టడం, వాపు చాలా నున్నగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
చర్మం పాలిపోతుంది.
పెదవుల లోపలి భాగంలో, చిగుళ్లు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గుతుంది.

*ఐరన్ లభించాలంటే…*

ఐరన్ లోపం తలెత్తకుండా మన ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మరీ సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుడి సలహాతో ఐరన్ సప్లిమెంట్లు వాడవచ్చు.

అయితే పలు రకాల ఆహార పదార్థాల్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అవేమిటంటే…

పప్పుధాన్యాలు, పాలకూర, గింజపప్పులు, చికెన్‌, కాబూలీ శనగల్లో ఇతర పోషకాలతో పాటు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. దీంతోపాటు జీలకర్ర, కొత్తిమీర, పసుపు, ఎర్ర మిరపకాయలు, బీట్ రూట్‌, టమాటలు, యాపిల్స్‌, చెర్రీలు వంటి ఎరుపు దనం ఉన్న పండ్లు,

No comments