టిడిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానని దోపిడీ ఆంధ్రాగా మార్చేశారు: పవన్‌..

రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తారని ప్రజల్ని నమ్మించారు, కానీ దోపిడీ ఆంధ్రాగా మార్చేశారంటూ పవన్‌ అన్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కబ్జాలకు పాల్పడుతున్నారాని అన్నారు. ఆఖరకు చెరువుల్ని కూడా వదలడంలేదన్నారు. పక్కనున్న తెలంగాణాలో ప్రభుత్వం చెరువుల్ని పూడికలు తీయించి ప్రజావినియోగానికి చూస్తుంటే  ఇక్కడ మాత్రం ఉన్న చెరువుల్ని కప్పెట్టి ప్లాట్లుగా చేసి అధికార పార్టీ నాయకులు అక్రమంగా అమ్మేసుకుంటున్నారని అన్నారు. ఎన్నికలకు ముందిచ్చిన ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేక పోయారని అన్నారు. మాట్లాడితే రైతు రుణమాఫీ అంటారు, అందెంత వరకు వచ్చిందంటూ ఆయన ప్రశ్నించారు. ఏ రైతుకైన ప్రయోజనం అందిందా అంటూ ప్రశ్నించారు.

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని జనసేన పరిరక్షిస్తుందని పవన్‌కళ్యాణ్‌ స్పష్టం చేశారు. దివంగత రామారావు గారు ఆత్మగౌరవం నినాదంతోనే పార్టీనేర్పాటు చేశారని ఆయన అన్నారు, కానీ తెలంగాణా ఉద్యమంలో ఆంధ్రుల్ని దోపిడీదార్లు, దొంగలుగా తిడుతుంటే తెలుగుదేశం పార్టీ చోద్యం చూసిందంటూ నిలదిశారు. తెలుగు ఆత్మగౌరవాన్ని పరిరక్షించడంతో పాటు తెలుగు వారిలో సమైక్యతను పాదుకొల్పుతామంటూ పవన్‌ పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకొచ్చాని అన్నారు. 30ఏళ్ళ వయసులోనే ప్రజాక్షేత్రంలోకి అడుగెట్టానన్నారు. కానీ సామాజిక బాధ్యతను తాను తీసుకుంటానని అన్నారు.

No comments