నా పెళ్లి గురించి నా కన్నా మీకే తో౦దరగా ఉ౦దే మిల్కీ బ్యూటీ !!!

మిల్కీ భామ  తమన్నా సినిమాలతోనే కాకుండా స్టోర్ ఓపెనింగ్స్..  లాంటి వాటితో ఎప్పుడూ బిజీగా ఉంటుంది అని మనకు తేలిసి౦దే. ఈమధ్య హ్యపీ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయింది.  ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తమన్నా రిపోర్టర్ల ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చింది.
తమన్నాను మీ పెళ్లి ఎప్పుడు అని అడిగితే మాత్రం కస్సుబుస్సులాడింది. "నా పెళ్లి గురించి మీకెందుకండీ. మీకు పెళ్లయిందా కదా? మీరు హ్యాపీగా ఉన్నారా కదా? నా పెళ్లి గురించి ఇంటర్నెట్లో చాలా వార్తలు చూస్తున్నాను. నాకు అతడితో ఇతడితో పెళ్లి అవుతుంది అని రాస్తున్నారు.  నాకది చాలా  ఆశ్చర్యంగా ఉంది.  ఇతర హీరోయిన్లకు మంచి హస్బెండ్ దొరికాడు కాబట్టి త్వరగా పెళ్లయింది. అందరికీ అలా దొరకాలి కదా... మీ అందరి ఆశీస్సులతో నాకు మంచి హస్పెండ్ దొరుకుతాడని ఆశిస్తున్నాను.  ప్రస్తుతానికి నేను ఇపుడు నా పనులతో చాలా బిజీగా ఉన్నాను" అని చెప్పుకొచ్చి౦ది..
అయితే ఇ౦తకి మీ   ఫేవరెట్ హీరో ఎవరని ఆడిగితే " ఇది అన్ఫెయిర్ క్వశ్చన్.. ప్రభాస్, రానా, చరణ్ నేను వర్క్ చేసిన హీరోలందరూ అందరూ నాకు ఇష్టమే. ఇలా చాలామందితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం" అని చెప్పుకొచ్చి౦ది.  'సైరా' సినిమా లో తన పాత్ర గురించి ఆడిగితే "సైరా లో నాదొక కీలక పాత్ర. గతంలో గతంలో సూరి సర్తో 'ఊసరవెల్లి' సినిమా చేశాను. 'సైరా'లో చిరంజీవి గారితో పని చేయడం సంతోషంగా ఉంది. 'బాహుబలి'లో నేను చేసిన పాత్రకు ఎంత మంచి పేరొచ్చిందో సైరాలో చేసే పాత్రకు కూడా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది'' అంటూ ముగించింది.



No comments