మోదీ ఒప్పుకుంటే…ఆయనకు పెళ్లి సంబంధం చూస్తా: ట్రంప్

మోదీజీ గనక పెళ్లికి ఒప్పుకుంటే ఆయన కోసం వధువును చూస్తాను అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. వినడానికే కాస్తా గందరగోళంగా ఉన్నా ఈ విషయం మాత్రం వాస్తవమంటుంది విదేశి మీడియా. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పుడో వివాహం అయ్యింది. కానీ ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉంటున్నారు. అలాంటిది మోదీకి ట్రంప్‌ పెళ్లి సంబంధాలు చూడటం ఏంటి అనుకుంటున్నారా..? అవును గతేడాది భారత్‌ – అమెరికా అధ్యక్షుల సమావేశం సందర్భంగా ట్రంప్‌ ‘మోదీ ఒప్పుకుంటే నేను ఆయన కోసం పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తుతాను’ అంటూ చతుర్లాడరంట. ఈ విషయాలన్నింటిని ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ‘పొలిటికో’ వెలువరించింది.

విదేశీ నేతలతో సమావేశాల సందర్భంగా ట్రంప్ మర్చిపోయిన మర్యాదల గురించి ‘దౌత్య సమావేశాలు-తప్పిదాలు’ అనే కథనాన్ని పొలిటికో ప్రచురించింది. విదేశీ నేతలతో సమావేశం సందర్భంగా ట్రంప్ టెంపరితనం, టెలిఫోన్ కాల్స్ సందర్భంగా మరిచిపోయిన మర్యాదలు, ఇతర దేశాల పేర్లను తప్పుగా ఉచ్ఛరించిన సందర్భాల గురించి ఈ కథనంలో పేర్కొంది. గత ఏడాది భారత్ తో జరిగిన సమావేశం సందర్భంగా దక్షిణాసియా మ్యాప్ ను ట్రంప్ తొలిసారి పరిశీలించారట. ఈ సందర్భంగా నేపాల్ ను నిపుల్, భూటాన్ ను బుట్టోన్ గా పలికారని పొటిలికో తెలిపింది. అంతేకాదు ఈ దేశాలను కూడా భారత్ లో అంతర్భాగంగానే ట్రంప్ భావించారట.

ఇదే సమయంలో మోదీ గురించి ప్రస్తావన రావడంతో..ప్రస్తుతం మోదీ తన భార్యతో కలిసి ఉండటం లేదు. అందువల్ల ఈ సమావేశానికి ఆయన ఒంటరిగా వస్తున్నారని వైట్‌ హౌస్‌ అధికారులు తెలిపారంట. అందుకు ట్రంప్‌ ‘అలా అయితే మోదీ కోసం నేను సంబంధం చూస్తాన’ని జోక్‌ చేశారంట. సమావేశానికి హాజరయిన పేర్లు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు అధికారులు ఈ విషయాల గురించి తమతో చెప్పినట్లు పొలిటికా ప్రకటించింది.

No comments